Current Date: 23 Sep, 2024

గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన చిరంజీవికి లోకేశ్‌, కేటీఆర్ విషెస్.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్సులో చోటు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. 150కి పైగా సినిమాల్లో అత్య‌ధిక డ్యాన్స్ స్టెప్పులతో అల‌రించినందుకు ఆయ‌న‌కు ఈ అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ నేప‌థ్యంలో చిరుకు సినీ, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.  తాజాగా ఏపీ మంత్రి నారాలోకేశ్‌,బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చిరంజీవికి 'ఎక్స్' వేదిక‌గావిషెస్ తెలియ‌జేశారు. చిరు చిందేస్తే అభిమానులకు పూనకాలే అంటూ లోకేశ్ ట్వీట్ చేయ‌గా అరంగేట్రం నుండి ఆధిపత్యం వరకు చిరంజీవికి ఇది ఎంతో అపురూప‌మైన ప్ర‌యాణమ‌ని కేటీఆర్,లోకేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Share