ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. రెండు సభలు కూడా ఈ నెల 11న ప్రారంభమయ్యాయి. మొత్తం పది రోజుల పాటు సమాశాలు సాగాయి. అసెంబ్లీకి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ సభ్యులు సైతం గైర్హాజరయ్యారు. ఇటు శాసనమండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీ 59 గంటల 57 నిమిషాల పాటు సాగింది. 75 ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు చెప్పారు. 21 ప్రభుత్వ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలాగే వార్షిక బడ్జెట్‌ను సైతం ప్రవేశ పెట్టారు. చర్చించారు. అటు శాసనమండలిలోనూ 8 బిల్లులకు ఆమోదం తెలిపారు. చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని మండలి రద్దు చేసింది. లోకాయుక్త సవరణ బిల్లు 2024కు ఆమోదం లభించింది.