Current Date: 26 Nov, 2024

బ్యాలెట్‌ పోలింగ్‌ విధానంతోనే ప్రజాస్వామ్యానికి మనుగడ

భారత దేశ ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే బ్యాలెట్‌ పోలింగ్‌ విధానం కావాలని, అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో  బ్యాలెట్‌ ఓటింగ్‌ జరుగుతోందని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ చింతామోహన్‌ అన్నారు. విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో   మాట్లాడుతూ ఈవీఎంల ట్యాంపరింగ్‌ వంద శాతం నిజమని అభిప్రాయపడ్డారు.   ‘‘తెలంగాణ సెక్రటేరియట్‌ రాజా భోగంలా ఉంటే ఆంధ్రాలో ఐదు షెడ్లు వేసి సెక్రటేరియట్‌ అంటున్నారు. 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టలేకపోయారు. దళితులు రెండుగా చీలటం వల్లే ఆంధ్ర విభజనకు నాంది పడిరది. రాష్ట్ర విభజన వలన ఆంధ్రప్రదేశ్‌ నష్ట పోయింది. కూటమి ప్రభుత్వం 100 రోజులలో ఏ ఒక్క పథకం అమలు చేయలేకపోయారు. రాష్ట్రంలో పెన్షన్‌ తప్ప ఇప్పటికే ఏమీ అమలు కాలేదు.’’ అని వ్యాఖ్యానించారు.   అమరావతి పూర్తి చేయాలంటే 100 సంవత్సరాల పైనే పడుతుందని చెప్పారు.   జగన్‌, షర్మిల మధ్య వ్యవహారం వ్యక్తిగతమన్నారు.  చంద్రబాబు  ఢిల్లీ పెద్దల వద్ద సాగిల పడుతున్నారు’’ అని చింతామోహన్‌ అన్నారు.

Share