తెలంగాణలో హైడ్రాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.హైడ్రా లాంటి చట్టం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని మిగతా జిల్లాల ప్రజలు కోరుకుంటుండగా.. ఏపీ ప్రజలు కూడా హైడ్రాను స్వాగతిస్తున్నారు. హైడ్రాపై ఏపీ రాజకీయ నేతలు కూడా సానుకూలంగానే స్పందిస్తుండటం గమనార్హం.ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో రాబోయే.. వర్షాలు, వరదలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే ప్రధాన కారణమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి.. బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. హైడ్రా చట్టం తీసుకొస్తే మొదట కూల్చాల్సింది కరకట్టపై అక్రమంగా కట్టిన నీ ఇల్లేనని వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు.
Share