Current Date: 26 Nov, 2024

రేణు దేశాయ్‌కి మళ్లీ అనారోగ్యం భయపెడుతున్న ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అనారోగ్యం గురించి సోషల్ మీడియాలో మరోసారి ఆమెపై చర్చ మొదలైంది. తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది. తన ఆరోగ్యం బాగాలేదని అందులో తెలిపింది. నిజానికి ఆరోగ్యం బాగాలేకపోవడం పెద్ద సమస్య కాదు. పైగా ఇది వైరల్ జ్వరాల కాలం కాబట్టి రేణుదేశాయ్ కూడా జ్వరంతో బాధపడే ప్రమాదం ఉంది.రేణు దేశాయ్‌కి పెద్ద ఆరోగ్య సమస్య ఉంది. ఆమె పుట్టుకతోనే గుండె జబ్బుతో పుట్టింది. ఆమె నాన్నమ్మ 47 ఏళ్లకే గుండె జబ్బుతో మరణించింది. ఇక ఆమె తండ్రి కూడా చాలా తక్కువ వయసులోనే గుండె జబ్బుతో చనిపోయారు. దాంతో  ఆ సమస్య ఇప్పుడు రేణు దేశాయ్‌ను కూడా వెంటాడుతోంది. ఎప్పటికప్పుడు ఆమె హెల్త్ చెకప్ చేయించుకుంటూ, గుండె వేగం పెరగకుండా మందులు వాడుతోంది.ఇలాంటి టైమ్ లో తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ రేణు దేశాయ్ పోస్ట్ పెట్టడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. భారతీయుడు-2లో వీధి కుక్కలపై పెట్టిన అభ్యంతరకర డైలాగ్స్‌పై స్పందిస్తూ.. ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందంటూ పోస్ట్ పెట్టి ఇటీవల రేణు దేశాయ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

Share