సాధారణంగా మనం పాము కాటు వేయడానే ఆసుపత్రికి పరుగెత్తుతాం. కానీ గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థిని పాము కాటేయగా వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా దానిని చంపిన తర్వాత మాత్రమే చికిత్స చేయించుకోవాలన్న పట్టుదలతో ప్రాణాలు కోల్పోయాడు.మయన్మార్‌కు చెందిన కొండన్న అనే విద్యార్థి ఎంఏ బుద్ధిజం చదివేందుకు గత నెలలోనే ఇక్కడకు వచ్చారు. ఏఎన్‌యూలో అంతర్జాతీయ విద్యార్థుల వసతి గృహంలో ఉంటున్న అతడు రాత్రి 10 గంటలకు ఆ దేశానికే చెందిన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లారు. వారిద్దరూ వర్సిటీ ప్రాంగణంలో ఓ పుట్ట వద్ద పుట్టగొడుగులు సేకరిస్తుండగా కొండన్నను పాము కాటేసింది. మయన్మార్‌లో ఎవరైనా పాము కాటుకు గురైతే దానిని చంపి దాంతో పాటే ఆసుపత్రికి వెళతారు. ఆ పాము జాతిని బట్టి వైద్యం అందిస్తారు. ఇందుకు అనుగుణంగానే రాత్రి 10.30 గంటలకు రక్తపింజరి కరిస్తే.. 12 గంటల వరకు దాని కోసం వారు వెతుకులాడారు.
Share