గత ప్రభుత్వం విశాఖలోని శారదాపీఠానికి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయించడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇష్యూపై రకరకాల వాదనలూ ఊపందుకున్నాయి. విశాఖ జిల్లా భీమిలి పట్టణం సమీపంలోని కొత్తవలస గ్రామంలో ఉన్న 15 ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించింది. ఒక ఎకరా భూమికి కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే తీసుకుని… ఆ భూమిని శారదా పీఠానికి ఇచ్చేసింది. అంటే మొత్తం 15 లక్షల రూపాయలకే 15 ఎకరాలను పిఠానికి గత ప్రభుత్వం అప్పగించింది.దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలువురు టీడీపీ నేతలు ఈ ఇష్యూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం… విశాఖ శారదా పీఠానికి సంబంధించిన భూములపై దృష్టి సారించింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం అధికారులతో భూములపై విచారణ జరిపించింది. కోట్లు విలువ చేసే 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక మంత్రివర్గంలోనూ భూముల రద్దుకు గ్రీన్ సిగ్నల్ దొరికింది.
Share