తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు తనికెళ్ల భరణి ఒకరు. ఆయన కేవలం నటుడుగానే కాకుండా.. రచయితగా తన కలంతో ఎన్నో చిత్రాలను అందించిన భరణి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు.
టీనేజ్‌లో లవ్, క్రష్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అని తనికెళ్ల భరణిని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. ప్రతివాడికీ ఉంటాయి.. అలాగే నాకు కూడా ఓ స్టోరీ ఉంది. మా కాలనీలోకి కొత్తగా వచ్చిన అమ్మాయితో జరిగిన ప్రేమ కథను ఇది. అని చెప్పుకొచ్చారు. అలానే మీ చిన్నతనంలో అల్లరి చేసేవారా? మీరు గుడ్ స్టూడెంట్నా? లేదంటే బ్యాడ్ స్టూడెంట్‌ని అని అడగ్గా.. ‘నేను చాలా బ్యాడ్ స్టూడెంట్‌ని.. ఎంత బ్యాడ్ అంటే చెట్టుకి కట్టేసి మా వాళ్లు కొట్టిన సందర్భం కూడా ఉందంటూ.. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు తనికెళ్ల భరణి. ఈ ఇంటర్వ్యూ త్వరలోనే పూర్తి స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
హైదరాబాద్ మాండలికంతో విలన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన భరణి.. అతి కొద్దికాలంలోనే కమెడియన్‌గా, రైటర్‌గా గొప్ప పేరుని సంపాదించుకున్నారు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో నాటకాలను రాశారు.