వైసీపీని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఎట్టకేలకి వీడాడు. గత మూడేళ్ల నుంచి అతను పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధినేత జగన్ ప్రతిసారీ పిలిపించడం, బుజ్జగించడం, రాయబారం పంపడం ద్వారా సర్దిచెప్తూ వచ్చారు. కానీ.. తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ వైయస్ జగన్‌కు బాలినేని లేఖ రాశారు. ఈరోజు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బాలినేని సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి బాలినేని వ్యవహారం వైసీపీ గత మూడేళ్లుగా పెద్ద తలనొప్పిగా మారిపోయింది. జగన్‌కు దగ్గరి బంధువై ఉన్నా బాలినేని తరచూ బహిరంగ విమర్శలతో పార్టీని ఇరుకునపడేశారు. మంత్రి పదవి నుండి తొలగించినప్పటి నుండి జగన్‌పై అసంతృప్తితోనే బాలినేని ఉన్నారు. గత మూడేళ్ల నుంచి నెలకి ఒకసారైనా వైసీపీ వీడుతున్నట్లు బాలినేని వర్గీయులు లీకులు వదులుతూ వచ్చారు. దాంతో సర్దిచెప్పడం, వివరణ ఇచ్చుకోవడం వైసీపీకి ఇబ్బందికరంగా మారిపోయింది. బాలినేని గురించి గతంలో ఒకసారి పవన్ మాట్లాడుతూ చాలా నిజాయితీపరుడని గొప్పగా చెప్పారు. దాంతో బాలినేని జనసేనలో చేరడం దాదాపు ఖాయమైపోయింది.
Share