Current Date: 21 Sep, 2024

బంగ్లాతో టెస్టు ముంగిట రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ క్లారిటీ

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన రిటైర్మెంట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. ఇటీవల టీ20 వరల్డ్‌కప్‌ను కెప్టెన్‌గా భారత్‌కి అందించిన రోహిత్ శర్మ  అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశాడు. అయితే, రోహిత్‌ శర్మ టీమిండియా తరఫున పొట్టి క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి.ఆ రూమర్స్‌పై రోహిత్ శర్మ మాట్లాడుతూ  ‘ఈ రోజుల్లో రిటైర్మెంట్‌ పెద్ద జోక్‌లా తయారైంది. చాలా మంది క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. మళ్లీ కొన్ని రోజులకే తిరిగి వస్తున్నారు. అయితే, ఇండియాలో అలా జరుగదు. ఇతర దేశాల ఆటగాళ్లను నేను గమనిస్తున్నాను. వారిలో చాలా మంది రిటైర్మెంట్‌పై యూటర్న్‌ తీసుకుంటున్నారు. నేను అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాను. నా ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు’’ అని క్లారిటీ ఇచ్చాడు.భారత్, బంగ్లాదేశ్ మధ్య గురువారం నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా భారత టెస్టు జట్టుని రోహిత్ శర్మ నడిపించనున్నాడు. భారత టీ20 కెప్టెన్‌గా ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన విషయం తెలిసిందే.

Share