నెల్లూరు పట్టణంలో వైసీపీ ఖాళీ అయింది. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో 15 మంది కార్పోరేటర్లు, ఓ కో-ఆప్షన్ సభ్యుడితో పాటు నుడా మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, 50 మంది వరకు వైసీపీ నేతలు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. 3వ వార్డు కార్పోరేటర్ సంక్రాంతి అశ్విని, 4వ వార్డు కార్పోరేటర్ పి.ప్రత్యూష, 5వ వార్డు కార్పోరేటర్ ఓ.రవిచంద్ర, 6వ వార్డు కార్పోరేటర్ ఎమ్.మస్తానమ్మ, 9వ వార్డు కార్పోరేటర్ దామవరపు రాజశేఖర్, 10వ వార్డు కార్పోరేటర్ కిన్నెర ప్రేమ్ కుమార్, 11వ వార్డు కార్పోరేటర్ గోతం అరుణ, 14వ వార్డు కార్పోరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, 15వ వార్డు కార్పోరేటర్ జి.వెంకటేశ్వర్ రెడ్డి, 16వ వార్డు కార్పోరేటర్ వి.శ్రీకాంత్ రెడ్డి, 47వ వార్డు కార్పోరేటర్ పొట్లూరు రామకృష్ణ, 48వ వార్డు కార్పోరేటర్ షేక్ ఇంతియాజ్, 49వ వార్డు కార్పోరేటర్ వి.రాజేశ్వరి, 51వ వార్డు కార్పోరేటర్ కాయల సాహిత్య, 54వ వార్డు కార్పోరేటర్ షేక్ సఫియా బేగం, కో-ఆప్షన్ మెంబర్ షేక్ జమీర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు.
Share