Current Date: 25 Nov, 2024

ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ...

సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ ఈ రోజు ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌ లో జరగనుంది. విచారణకు హాజరుకావాలంటూ ఆర్జీవీకి మద్దిపాడు పోలీసులు ఇటీవల నోటీసులు  జారీ చేసారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టు‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మని విచారించేందుకు పోలీసులు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాట్లు చేశారు.

Share