Current Date: 06 Jul, 2024

అబ్బ.. సూపర్ న్యూస్.. షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేసిన చైనా పరిశోధకులు.. ఎలానో తెలుసా

షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేశారు చైనా పరిశోధకులు.. కేవలం 11 వారాల్లోనే ఇన్సులిన్ ను పూర్తి చేశారు. సెల్ థెరఫీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు… వైద్య చరిత్రలోనే గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు శాస్త్రవేత్తలు. అసలు ఇది ఎలా సాధ్యమంటే.. క్రోమంలోని కణజాలంపై షుగర్ వ్యాధి ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో.. క్రియేటెడ్ ఆల్గారితం ద్వారా మొదట రీసెర్చ్ చేస్తారు. ఆ తర్వాత రోగి రక్తం లోని మూల కణాలను అంటే సీడ్ సెల్స్ లను తీసుకుని సెల్ థెరపీతో వాటిలో కొన్ని మార్పులు చేస్తారు. ఆ తర్వాత క్రమంలో ప్రభావితమైన కణాల స్థానంలో సెల్ ట్రాన్స్పరెంట్ ను ప్రవేశపెడతారు. క్రమంగా రోగికి ఇచ్చే ఇన్సులిన్ ఇతర మందులు మోతాదులు తగ్గిస్తారు. ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చిందని పరిశోధకులు తెలిపారు.2021 జూలైలో మొదట 4 రోగికి ఇలా సెల్ ట్రాన్స్ ప్లాంట్ చేశామని 11 వారాల సమయంలోనే అతను ఇన్సులిన్ ఇతర మందులు వాడకాన్ని పూర్తిగా మానేసినట్లు  చైనా పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి డయాబెటిస్ సంపూర్ణంగా నయమైనట్టు తెలిపారు.. చివరి మూడు నెలలుగా ఆ వ్యక్తి ఇన్సులిన్ తీసుకోవట్లేదని వివరించారు.చైనాలోని చాంగ్ జంగ్ ఆసుపత్రి, రేంజ్ ఆసుపత్రి వైద్యులు సంయుక్తంగా ఈ ప్రయోగం చేశారు. డయాబెటిస్ ట్రీట్మెంట్లో సెల్స్ ప్రయోగం ఓ గొప్ప ముందడుగు అని… సాంకేతికత విస్తృతంగా అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ తో బాధపడుతున్న కోట్లాది మందికి ఆర్థికంగా శారీరకంగా ఎంతో రిలీఫ్ లభిస్తుందని పలువురు వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.2021 లెక్కల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 53.7 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్ చికిత్సకు కేవలం 2021లో రోగులు ఖర్చు చేసిన డబ్బు 966 బిలియన్ డాలర్లు.. ఇందులో మరీ ముఖ్యంగా ప్రతి ఏడుగురు షుగర్ రోగుల్లో ఒకరు భారతీయులే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. గోవాలోని మొత్తం జనాభాలో 26 శాతం మంది డయాబెటిస్ రోగులేనని సర్వే వెల్లడించింది.ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. డయాబెటిస్ ను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సెల్ థెరపీతో చైనా శాస్త్రవేత్తలు వేసిన ముందడుగు వైద్యశాస్త్రంలో అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.