Current Date: 05 Oct, 2024

కింద మంటపెట్టినట్టే ఢిల్లీలో వాటర్ ట్యాంకులో సలసలా మరుగుతున్న నీళ్లు

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా భానుడు చెలరేగిపోయాడు. ఫలితంగా కనీవినీ ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే సూరీడి భగభగలకు జనం తల్లడిల్లిపోయారు. సాయంత్రమైనా సరే కాలుబయటపెట్టేందుకు భయపడ్డారు. రెండ్రోజుల క్రితం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడ నమోదైంది. వడగాలులకు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఎండ వేడికి అద్దంపట్టే వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.ఓ భవనంపైన ఉన్న నీళ్ల ట్యాంకులోని నీళ్లు కింద మంటపెట్టినట్టుగా కుతకుత ఉడికిపోయాయి. ఉష్ణోగ్రత 52 డిగ్రీలకు చేరుకోవడంతో ట్యాంకులోని నీళ్లు ఇలా మరిగిపోతున్నాయంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను పంచుకున్నాడు.