Current Date: 25 Nov, 2024

దేశంలో బీజేపీకి డేంజర్ బెల్స్.. ఇవిగో సంకేతాలు !

2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభ తగ్గింది. 2014, 2019 ఎన్నిక‌ల్లో బీజేపీకి పూర్తి మెజారిటీని కట్ట‌బెట్టిన ఓట‌ర్లు, ఇప్పుడు బీజేపీని చాలా చోట్ల దాదాపు తిర‌స్క‌రించారు. సింగిల్‌గా బీజేపీ 400 సీట్లు అంటూ.. మొద‌లుపెడితే చివరికి 241 దగ్గర కూర్చొంది. గత ఐదేళ్లు నేషనల్ మీడియాతో పాటు ప్రాంతీయ మీడియా కూడా మోడీని ఒక రేంజ్‌లో మోసింది అయినా.. ఆ స్థాయి ప్ర‌యోజ‌నాలు ద‌క్క‌లేదు2014లో యూపీలో 72 సీట్ల‌ను నెగ్గిన పార్టీ ఇప్పుడు అందులో స‌గానికి ప‌రిమితం అయ్యింది. మెజారిటీ సీట్ల‌ను ఎస్పీ- కాంగ్రెస్ ల కూట‌మి నెగ్గింది. మ‌హారాష్ట్ర‌లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ కూట‌మి పొందింది. అతి త్వ‌ర‌లోనే మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌బోతున్నాయి. అక్క‌డ బీజేపీ వేసిన వేషాలు  అన్నీ ఇన్నీ కావు. అవేవీ మెజారిటీ ఎంపీ సీట్ల‌ను ద‌క్కించ‌లేక‌పోయాయి. కాంగ్రెస్ నేత‌ల‌ను ఎడా పెడా చేర్చుకున్నా.. ఉప‌యోగం లేక‌పోయింది.బీజేపీ బలం ఉత్తర భారతదేశం. కానీ అనూహ్యంగా ఉత్తరంలో లైట్ తీసుకుంటూ.. ప్రాంతీయ పార్టీలకి అడ్డాగా ఉన్న దక్షిణాన పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దాంతో.. కొన్ని చోట్ల చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాన పట్టుని కూడా బీజేపీ కోల్పోతోందని ఫలితాలు చెప్తున్నాయి.