ఈస్టర్న్ సెక్టార్‌లోని అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్‌లో నైట్ విజన్ గాగుల్స్ ని ఉపయోగించి C-130J విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో మైలురాయిని సాధించింది. వ్యూహాత్మక ఎయిర్‌లిఫ్ట్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇండక్షన్‌తో భారత వైమానిక దళ సామర్థ్యాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఈ విమానాలు కోవిడ్-19 మహమ్మారి సమయంలో వ్యాక్సిన్‌ల సరఫరాలో, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడంలో కీలకంగా వ్యవహరించాయి. C-130J అనేది రెండు పైలట్ ఫ్లైట్ స్టేషన్, షార్ట్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్న అత్యాధునిక విమానం. ఇది నైట్ విజన్ గాగుల్స్ , ఇన్‌ఫ్రారెడ్ థర్మల్ ఇమేజరీని ఉపయోగించి అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని, పగలు రాత్రి కార్యకలాపాలకు వీలు కల్పిస్తూ పూర్తిగా సమీకృత డిజిటల్ ఏవియానిక్స్‌తో అమర్చి ఉంటుంది.వీటితోపాటు విమానంలో కలర్ మల్టీఫంక్షనల్ లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లేలు, హెడ్-అప్ డిస్‌ప్లేలు అధునాతన నావిగేషన్ సిస్టమ్‌లు, డ్యూయల్ ఇనర్షియల్ నావిగేషన్, GPSలు ఉన్నాయి.