Current Date: 06 Jul, 2024

ఏసీపీ ఉమామహేశ్వర్ రావు అరెస్ట్

సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్లో అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. రూ. 38 లక్షలు, 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం అతని వద్ద రూ. 40 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. నేడు (బుధవారం) అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.