కమిషనర్ డాక్టర్ శంకభ్రత బగ్జీ మంగళవారం ఔదార్యం ప్రదర్శించారు. ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరగ్గా పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో సీపీ బగ్జీ తన వాహనంలో అటుగా వస్తున్నారు. గాయాలపాలైన వారిని దగ్గరుండి ఆయన కాన్వాయ్‌లో కేజీహెచ్‌కు తరలించారు. అంతేకాకుండా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలంటూ ఈస్ట్ ట్రాఫిక్ సీఐ రేవతమ్మను సీపీ ఆదేశించారు. అంతేకాకుండా కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్లను కూడా కోరారు. విశాఖ సీపీగా చేరిన ఒక్కరోజు వ్యవధిలోనే క్షతగాత్రులకు సహాయ పడిన బగ్జీ తీరుకు నగర ప్రజలు ఫిదా అయ్యారు.
ప్రజలతో ముఖాముఖి ….24గంటల వ్యవధిలోనే సీపీ బగ్జీ మమేకమయ్యారు. వివిధ విభాగాధిపతులతో సమావేశమై ప్రజలేం కోరుకుంటున్నారో వాటిని తీర్చాల్సిన బాధ్యత మనపైనే ఉంటుందన్నారు. అంతేకాకుండా పెందుర్తి వెళ్లి అక్కడి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. నగర ప్రజలకు తన ఫోన్ నంబర్ ఇచ్చి కష్టమొస్తే సంప్రదించొచ్చన్నారు.
Share