Current Date: 06 Jul, 2024

కలెక్టర్‌గా హరేందిర ప్రసాద్‌ బాధ్యతలు సతీసమేతంగా సింహ్రాదప్పన్న దర్శనం

 విశాఖ కలెక్టర్‌గా హరేందిర ప్రసాద్‌ ఎంఎన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పలువురు విభాగాధిపతులు, సిబ్బంది కొత్త కలెక్టర్‌కు సాదర స్వాగతం పలికారు. అంతకుముందు హరేందిర ప్రసాద్‌ దంపతులు సింహాద్రప్పన్న దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన్ను కొంతమంది ప్రజా ప్రతినిధులు, నగర ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్ఛాలిచ్చి అభినందించారు.

 

Share