దీపావళి పండుగను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక పూజలతో పాటు.. కుటుంబ సభ్యులంతా కలిసి దీపాలు వెలిగించి, టపాసులు పేల్చుతూ సందడిగా గడిపేందుకు తెలుగు లోగిళ్లు సిద్ధమవుతున్నాయి. అయితే, దీపావళి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31న తిరుమలలో దీపావళి ఆస్థానం నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. ఎల్లుండి సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ పేర్కొంది.