Current Date: 07 Oct, 2024

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఆందోళన చెందొద్దు

విశాఖ స్టీల్‌ ప్లాంటులో కేంద్రమంత్రి హెచ్‌డీ కుమార స్వామి పర్యటించారు. ఉక్కు పరిశ్రమ స్థితిగతులను శుక్రవారం పరిశీలించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు విశాఖ ఉక్కు కర్మాగారంపై పడిరది. గత మూడు సంవత్సరాలుగా స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంపై కార్మికుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో విశాఖకు వచ్చిన కేంద్రం ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి స్టీల్‌ప్లాంట్‌ పై ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారో అన్న ఆసక్తి ఉత్కంఠ అటు రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా యావత్‌ దేశంలో నెలకొంది. ఆందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉక్కు పరిశ్రమకు చేరుకున్న కేంద్ర మంత్రి కుమార స్వామి ఉక్కు యాజమాన్యం, కార్మిక సంఘాలు నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంతో విశాఖ ఉక్కు భవిష్యత్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగుల ఆందోళన, జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సంస్థ నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి, కేంద్రమంత్రి రాకతో పరిస్థితి మారుతుందా? సెయిల్‌లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది.

Share