Current Date: 27 Nov, 2024

సింహగిరి ప్రదక్షిణకు వేళాయె

సింహాచలం క్షేత్రంలో   జరిగే వార్షిక ఉత్సవాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది సింహగిరి ప్రదక్షిణ.   ఏటా ఆషాఢ పున్నమి నాడు స్వామివారికి ఆఖరు విడతగా శ్రీగంధం సమర్పణ చేయడం సంప్రదాo ముందురోజు చతుర్దశి నాడు సింహగిరి ప్రదక్షిణ చేయడం ఆచారం.     శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పూల రథం ప్రదక్షిణ ప్రారంభమవుతుంది.  రాత్రి పది గంటలకు తిరిగి రథం సింహాచలం చేరుకుంటుంది. చతుర్దశి నాడు కొండ చుట్టూ (సుమారు 32కిలోమీటర్లు) ప్రదక్షిణ చేయలేని భక్తులు పున్నమి నాడు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. సింహాచలం వచ్చిన భక్తులు ముందుగా తొలి పావంచా వద్ద అంటే తొలి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించాలి. పాత అడివివరం, ముడసర్లోవ, హానుమంతువాక, విశాలాక్షీ నగర్‌, జోడుగుళ్ళపాలెం, అప్పఘర్‌, లుంబినీపార్క్‌, వెంకోజీపాలెం, హెచ్‌ బీ కాలనీ, సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం, పోర్టు స్టేడియం మీదుగా జాతీయ రహదారికి చేరుకుని తాటిచెట్ల పాలెం, కంచరపాలెం, మురళీ నగర్‌ మాధవధారకు వెళ్ళీ అక్కడ నుండి ఆర్‌ అండ్‌ బీ ఎన్‌ ఎస్‌ టీ ఎల్‌ మీదుగా ఇందిరా నగర్‌, లక్ష్మీ నగర్‌ కుమారీ కళ్యాణ మండపం, ప్రహ్లాదపురం మీదుగా తొలిపావంచాకు చేరుకోవడంతో ప్రదక్షిణ పూర్తవుతుంది.

Share