కేసీఆర్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని.. త్వరలోనే కేటీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్లటం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృత్ టెండర్లలో విషయంలో భారీ అవినీతి జరిగిందంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ కుటుంబంలో ఇప్పటికే గొడవలు షురూ అయ్యాయని.. అందుకే కేటీఆర్ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడి పదవి తనకొద్దని.. కేసీఆర్ అంటున్నారన్న కోమటిరెడ్డి.. ఆ పదవి నాకంటే నాకు కావాలంటూ కేటీఆర్, హరీశ్ రావు పట్టుబడుతున్నారంటూ చెప్పుకొచ్చారు.ఇక ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. అమెరికా నుంచి హైదారాబాద్‌కు వస్తే కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ జైలుకు వెళ్లడం ఖాయమంటూ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు వెళ్లి ప్రభాకర్ రావును హైదరాబాద్‌కు రావొద్దంటూ కేటీఆర్, హరీష్ రావు దండం పెట్టి వచ్చారని ఆరోపించారు. ఒకవేళ ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు వచ్చి అప్రూవర్‌గా మారితే మాత్రం ఇద్దరు జైలుకు వెళ్లటం ఖాయమని చెప్పుకొచ్చారు.
Share