చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో మరుపురాని జ్ఞాపకంగా మిగలనుంది.భారత టెస్టు క్రికెట్ 92 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఓటముల సంఖ్యను టీమిండియా అధిగమించింది. ఇప్పటి వరకు 580 టెస్టులు ఆడిన భారత్.. 179 విజయాలు సాధించింది. మరో 178 ఓటములు, 222 మ్యాచ్‌లను డ్రా, ఒకటి టైగా ముగించింది. ఈ మ్యాచ్ కంటే ముందు టెస్టుల్లో భారత్ గెలపుటముల సంఖ్య(178-178)తో సమనంగా ఉన్నాయి.ఇప్పుడు బంగ్లా విజయం సాధించడంతో ఓటముల కంటే అత్యధిక విజయాలను టీమిండియా నమోదు చేసింది. 1932 నుంచి టెస్టులు ఆడుతుండగా.. 92 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ చరిత్రలో ఈ సరికొత్త ఆధ్యాయానికి చెపాక్ స్టేడియం వేదిక కావడం విశేషం. కాగా 92 ఏళ్ల ప్రయాణంలో భారత జట్టు కెప్టెన్‌లుగా 36 మంది పనిచేశారు.
Share