Current Date: 23 Sep, 2024

'దేవర’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమా ఈ నెల 27న థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి.. రిలీజ్ అవుతున్న అన్ని భాషల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తున్న చిత్ర యూనిట్.. తెలుగు ప్రేక్షకుల కోసం ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. అయితే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నోవాటెల్ హోటల్‌లో నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు.సాయంత్రం ఆరు గంటలకు ఈవెంట్ ప్రారంభం కావాల్సి ఉండగా  అది కాస్త మొత్తానికి రద్దయింది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడానికి కారణం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల ఓవరాక్షనే. పాసులు లేని వాళ్లు కూడా ఈవెంట్ వేదిక వద్దకు దూసుకెళ్తుండటంతో.. నోవాటెల్ సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు.. అత్యుత్సాహంతో హోటల్‌లోని అద్దాలు పగలగొట్టారు. పర్నీచర్‌ ధ్వంసం చేశారు. దీంతో.. నోవాటెల్ దగ్గర గందరగోళ పరిస్థితి నెలకొంది.పోలీసులు రంగంలోకి దిగినా.. ఫ్యాన్స్ ఓవర్ ఎగ్జైట్ మెంట్‌తో వర్కవుట్ కాలేదు. దాంతో లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఈవెంట్ జరిపితే.. పరిస్థితి చేయి దాటి పోతుందని భావించిన మూవీ టీం.. ప్రోగ్రాంను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Share