Current Date: 04 Jul, 2024

నేడు సీఎం హోదాలో చంద్రబాబు సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణం

ఐదేళ్లు గిర్రున తిరిగాయి. అధికారం చేతులు మారేందుకు పెద్దగా సమయం పట్టలేదు. 151 సీట్లతో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి   ఆ పార్టీ నేతలకు పట్ట పగ్గాల్లేవ్. ఫలితంగా జగన్ ప్రతిపక్ష హోదాను కోల్పోగా ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగు పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీలో సాధారణ సభ్యుడుగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు..  వైసీపీ ప్రతిపక్ష హోదా లేకపోవడంతో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఏపీ అసెంబ్లీలో వరసగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, మహిళా సభ్యులు సాధారణ సభ్యులు ప్రమాణం చేశారు.

Share