Current Date: 04 Jul, 2024

అసెంబ్లీకి వెనుక గేటు నుంచి వచ్చిన జగన్

వైకాపా అధ్యక్షుడు, మాజీ సీయం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ సభలో ఉండకుండా  చాంబర్ కు వెళ్లిపోయారు. అంతకు ముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగంణంలోకి  వచ్చారు. గతంలో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణం లోకి వచ్చినా ఆయన లోపలికి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తరువాత వెళ్లారు. తన ప్రమాణ స్వీకారం టైం వచ్చినప్పుడే సభలో జగన్ అడుగుపెట్టారు.

Share