ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసిన వేళ. విశాఖపట్నంలో ప్రస్తుతం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
రానున్న మూడు గంటల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించగా. ఈ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. ఇదే సమయంలో విశాఖ నగరంలో భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు నమోదవుతున్నాయి.
పిడుగులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.