మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్్ప మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి అమర్నాథ్్కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 24న ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట హాజరై తన వ్యాఖ్యలకు సంబంధించి వివరణతో పాటు... ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. గడువులోపు స్పందించకపోతే అందుబాటులో ఉన్న వీడియో క్లిప్పింగులు, మహిళల ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ హెచ్చరించింది.