నిన్న అఫ్గాన్‌తో మూడో వన్డేలో గెలుపుతో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. ICC శాశ్వత జట్లలో ఒక్కసారి కూడా అఫ్గాన్ చేతిలో ఓడని ఏకైక టీమ్ భారత్ మాత్రమే. 3 ఫార్మాట్లలో కలిపి IND-AFG మధ్య 18 మ్యాచులు జరగ్గా, టీన్ఇండియా 16 విజయాలు సాధించింది. ఓ మ్యాచ్ టై కాగా, మరొకటి రదైంది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో భారత్ సొంతం చేసుకోగా, మొత్తం 238 రన్స్ చేసిన కెప్టెన్ గిల్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచారు.