Current Date: 21 Jun, 2026

మన్యం, విజయనగరం, అల్లూరికి రెడ్ అలెర్ట్! రానున్న 3గంటల్లో భారీ వర్షాలు!

యాంకర్...
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు గంటల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. పిడుగులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ సూచించారు.