Current Date: 27 Nov, 2024

ట్విట్టర్‌లో ఫస్ట్ నైట్ వీడియో పెట్టిన కొత్త పెళ్లికొడుకు!

సోషల్ మీడియా పిచ్చి ప్రపంచవ్యాప్తంగా పీక్స్‌కి చేరింది. లైక్స్‌ కోసం ఫాలోవర్లను పెంచుకోవడానికి ఎంతకైనా నెటిజన్లు దిగజారుతున్నారు. కొందరు ప్రాణాలను పనంగా పెడుతుంటే.. మరికొందరు ఆత్మగౌరవాన్ని, సిగ్గును కూడా వదిలేస్తున్నారు. ఎలాగైనా పాపులర్‌ అవ్వాలని వ్యక్తిగత జీవితాలను కూడా బజార్లో పెట్టేసుకుంటున్నారు.ఇటీవల ఓ కొత్త జంట ఏకంగా తమ మొదటి రాత్రి వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టేసింది. కొత్తగా పెళ్లైన జంటకు శోభనం ఏర్పాటు చేశారు. గదిని పూలతో అలంకరించారు. అయితే నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఈ కార్యాన్ని కాస్త మనోడు అత్యుత్సాహంతో సోషల్‌ మీడియాలో పెట్టేశాడు. పూలతో అలంకరించిన మంచాన్ని వీడియోలో చూపిస్తూ, తన భార్యను పిలిచి మరీ నెటిజన్లతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ వీడియోలో సదరు వ్యక్తి మాట్లాడుతూ.. 'హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు మా ఫస్ట్ నైట్ జరగబోతోంది.. మంచాన్ని సువాసన వెదజల్లే పూలతో ఎంతో అందంగా అలంకరించారు' అని చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా తన భార్యతో సైతం వీడియోలో మాట్లాడించాడు. ఈ వీడియో కాస్త తెగ వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. దాంతో గంటల వ్యవధిలో ఆ పోస్ట్‌ని డిలీట్ చేశాడు.

Share