కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు స్వల్ప ఊరటే లభించింది. భారీగా ప్రయోజనం చేకూరుతుందని భావించిన ట్యాక్స్ పేయర్లకు నిరాశే ఎదురైంది.స్టాండర్డ్ డిడక్షన్, స్లాబ్ విదానంలో మార్పులు మినహా మరేవీ చోటుచేసుకోలేదు. మొత్తానికి ట్యాక్స్ చెల్లింపుదారులకు ఆశించిన ప్రయోజనం మిగల్చలేదు నిర్మలమ్మ పద్దు. ఈసారి కేంద్ర బడ్జెట్ పై మధ్య తరగతి, వేతన జీవులు చాలా ఆశలు పెట్టుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల రూపాయల్నించి 1 లక్ష రూపాయలకు పెరగవచ్చని భావించారు. ట్యాక్స్ పరిమితి స్లాబ్ కూడా 7 లక్షల నుంచి 8 లక్షలకు పెంచుతారని అనుకున్నారు. కానీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కాస్త నిరాశే మిగుల్చింది. స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి కేవలం 75 వేలకు పెంచారు. ఇక ట్యాక్స్ స్లాబ్ విదానంలో స్వల్ప మార్పులు చేశారు.ఈ మార్పుల ప్రకారం 0 నుంచి 3 లక్షల ఆదాయం వరకూ జీరో ట్యాక్స్ 3 నుంచి 7 లక్షల ఆదాయం వరకూ 5 శాతం ట్యాక్స్ 7-10 లక్షల ఆదాయం వరకూ 10 శాతం ట్యాక్స్ 10-12 లక్షల ఆదాయం వరకూ 15 శాతం ట్యాక్స్ 12-15 లక్షల ఆదాయం వరకూ 20 శాతం ట్యాక్స్ 15 లక్షల ఆదాయం దాటితే 30 శాతం ట్యాక్స్ఇది కాకుండా దీర్ఘ కాలిక కేపిటల్ లాభాలపై పన్ను పరిమితిని 2.5 లక్షలకు పెంచారు.
Share