Current Date: 07 Oct, 2024

వగలమారి.... వయ్యారి భామ ఈ మొక్క పేరులో అందం...గుణం ప్రాణాంతకం

ఫర్తేనియం హైస్టెరోఫోరస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క పేరు వయ్యారి భామ.
వయ్యారిభామ అనే అందమైన పేరు కలిగిన ఈ మొక్క అత్యంత ప్రమాదకరమైన పుష్పించే జాతి కలుపు మొక్క. అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క అతి త్వరగా ఏపుగా పెరిగే పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. అంతే కాక ప్రజల, పశువుల ఆరోగ్యంపై కూడ అధికమైన దుష్ప్రభావము చూపిస్తుంది.  పంట పొలాలలోనూ, గట్లు పైన,  రహదారుల పక్కన, ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా ఈ మొక్క పెరుగుతుంది. నిత్యం ఈ మొక్కను చూసే ప్రజలకు మాత్రం ఇది ఎంత ప్రమాదకరమైనదో అవగాహన లేదు.ఈ వగలమారి.. వయ్యారిభామ మొక్క కలిగించే నష్టాల గురించి తెలుసుకుందాం.వయ్యారిభామ అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. ఇది ఎక్కువగా తవ్విన లేదా మరే రకంగా ఐనా మానవ ప్రమేయానికి లోనైన నేలపై మొలుస్తుంటుంది. అందుకే దీన్ని రోడ్ల పక్కన ఎక్కువ చూస్తూ ఉంటాము.

 

 

Share