పోలీసులు.అరెస్ట్ విషయంలో.. నటి హేమ అనుసరించిన టెక్నిక్కులనే దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా అనుసరిస్తున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తోంది. బెంగుళూరులో రేవ్ పార్టీ జరిగినప్పుడు.. హేమ అక్కడ డ్రగ్స్ తీసుకున్న బ్యాచిలో దొరికిపోయారు. అయితే ఆ వార్తలు మీడియాలో వైరల్ అయ్యే సమయంలోనే.. ఆమె కన్నడ పోలీసుల కళ్లుగప్పి దొరికిపోయిన కాంపౌండ్ ఆవరణలోనే ఒక చెట్టు వద్దకు వెళ్లి ఒంటరిగా నిల్చుని ఫ్యాన్స్ కోసం ఓ వీడియో చేశారు.తన మీద రకరకాల పుకార్లు వస్తున్నాయని.. ఎవ్వరూ ఆ పుకార్లను నమ్మవద్దని, తాను హైదరాబాదులోనే, తన ఫాంహౌస్ లో ఎంజాయ్ చేస్తున్నానని ఆ వీడియోలో చెప్పారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బెంగుళూరులో పోలీసులు అదుపులో ఉంటూ అలాంటి తప్పుడు పోస్టు పెట్టినందుకు పోలీసులు మరింత సీరియస్ అయి.. ఆమె మీద కేసుల ఉచ్చు బిగించారు. అది వేరే సంగతి.అచ్చంగా హేమ అనుసరించిన బాటలోనే రాంగోపాల్ వర్మ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన 25న పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Share