Current Date: 07 Oct, 2024

అసభ్యకర పోస్టులపై మాజీ మంత్రి సిదిరిపై కోర్టులో కేసు జిల్లా కోర్టుకు హాజరైన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

సామాజిక మాధ్యమాల్లో తన మీద తన  కుటుంబం మీద రాసిన అశ్లీల అసభ్యకరమైన పోస్టులు, రాతలపై విశాఖ రెండవ అడిషనల్ సివిల్ జడ్జి  న్యాయస్థానంలో దావా వేసినట్టు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం జిల్లా కోర్టులో వాయిదాకు హాజరై జడ్జికి తన గోడు వెళ్లబుచ్చుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడుతూ  గత ఐదు సంవత్సరాలుగా సోషల్ మీడియాను అగౌరవంగా, అసభ్యకరంగా ఎలా వాడొచ్చా అన్నది వైసీపీ చూపించిందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న అధికారపక్షంలో ఉన్న రాజకీయ విమర్శలు సర్వసాధారణం అని, అవి ఆరోగ్యకరంగా ఉండాలన్నారు. అయితే  టీడీపీలో న్యాయబద్ధంగా , నీతిగా పోరాడే ప్రతి ఒక్క మహిళ సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలను మాటలతోనూ, మార్ఫింగ్ ఫోటోలుతోను ఇబ్బంది పెట్టారని, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు 20 మందిని పోషిస్తూ తనపై, తండ్రిపై అసభ్యకరంగా మాట్లాడించారని ఆరోపించారు. వేధింపులపై పలాస పోలీస్ స్టేషన్ లో ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకోలేదని, అందుకనే కోర్టు ద్వారా వారిపై న్యాయపోరాటం చేస్తున్నాన్ని స్పష్టం చేశారు. 

Share