భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. శ్రీలంకతో ఈ నెలాఖరులో జరిగే టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యాను కాదని సూర్య కుమార్ యాదవ్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో తీవ్ర స్థాయిలో దుమారం రేగిన సంగతి తెలిసిందే. టీమ్‌కి ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆటగాడికే కెప్టెన్సీ ఇవ్వాలని నిర్ణయించాం అందుకే సూర్య కుమార్‌కు టీ20 కెప్టెన్సీ ఇచ్చాం. భారత జట్టులో హార్దిక్ కీలక ప్లేయర్ అన్నారు. కానీ.. సూర్యకు కెప్టెన్ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి అని అగార్కర్ స్పష్టం చేశాడు. ఫిట్‌నెస్, డ్రెస్సింగ్ రూమ్ ఫీడ్‌బ్యాక్ వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సూర్యకు పగ్గాలు అప్పగించామని అగార్కర్ స్పష్టం చేశాడు. హార్దిక్ పాండ్య గత కొన్నిరోజులుగా భార్యతో విభేదాలు, విడాకుల నేపథ్యంలో మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా లేడు. దాంతో సూర్యకి కెప్టెన్సీ ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Share