దేశంలో సంచలనం రేపుతోన్న నీట్- యూజీ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్, గ్రేస్ మార్కుల కేటాయింపు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీక్ ఇష్యూపై తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. నీట్ ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగింది. బిహార్‌లో జరిగిన నీట్ పేపర్ లీక్‌తో పాటు గ్రేస్ మార్కులపై కేటాయింపుపై సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది.