సాధారణంగా చాలా మంది హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు. సాయిపల్లవి మాత్రం కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. మరీ ముఖ్యంగా ఆమె డాన్స్‌కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ గత దశాబ్ధకాలంగా ఉంది. అప్పట్లోనే ఢీ షోలో అదరగొట్టిన సాయి పల్లవి.. సినిమాల్లోనూ డాన్సింగ్ టాలెంట్‌ను చూపిస్తోంది. సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్‌కి తమిళనాడులో సంప్రదాయబద్ధంగా సాయి పల్లవి పెళ్లి చేసింది. ఈ పెళ్లిలోనూ తన డాన్స్ తో అందర్నీ మెస్మరైజ్ చేసింది సాయిపల్లవి. 5 పాటలకు సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆహుతుల్ని అలరించింది. ఆ తర్వాత బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి మరో 5-6 పాటలకు డాన్స్ చేసింది. చెల్లికి పెళ్లి అయిపోవడంతో సాయిపల్లవి పెళ్లి టాపిక్ కూడా తెరపైకొచ్చింది. నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? అంటూ చాలామంది ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టారు. కానీ తాను జీవితంలో పెళ్లి చేసుకోనని గతంలో సాయిపల్లవి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె నాగచైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తోంది.
Share