Current Date: 30 Sep, 2024

వరదలపై కేసీఆర్ మౌనం ఆత్మరక్షణలోకి బీఆర్‌ఎస్

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు రావడంలేదు.  తెలంగాణ రాష్ట్రం భారీ వానలతో అతలాకుతలమవుతోంది. కనీవినీ ఎరుగని నష్టం కలిగింది. పంటలు దెబ్బ తిన్నాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయి. అయినప్పటికీ కేసీఆర్ మౌనం పాటిస్తున్నాడు. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రే కాకుండా రెండుసార్లు ముఖమంత్రిగా చేసిన నాయకుడు. తెలుగు, ఇంగ్లిష్ అండ్ ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన కేసీఆర్ ఇలా మౌనంగా ఉండటం అటు బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. కేసీఆర్  వరద బాధితుల మధ్యకు రావాలి, ఓదార్చాలి కదా. వారికి ధైర్యం చెప్పాలి అని వారు కోరుతున్నారు.అలానే కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా స్పందించకపోతే కడిగిపారేయాలి అని చెప్తున్నారు. కానీ.. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ వీడటం లేదు. కేటీఆర్, హరీశ్ రావు క్షేత్ర స్థాయిలో పోరాడుతున్నా ఆదరణ లభించడం లేదు. పైపెచ్చు మొన్న బీఆర్‌ఎస్ వారిపై బాధితులు దాడికి కూడా దిగారు. అయినా కేసీఆర్ మౌనం వీడటం లేదు.

Share