Current Date: 26 Nov, 2024

ఎమ్మెల్యే ఆదిమూలంకి ఫ్యామిలీ వత్తాసు వీడియోలు ఫేక్ అట

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త చేసిన లైంగిక ఆరోపణలు ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారాయి. ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ నేపథ్యంలో ఆదిమూలం కుటుంబ సభ్యులు భార్య గోవిందమ్మ, ఆయన కుమార్తెలు మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. తన భర్త మీద వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని  ఆదిమూలం భార్య గోవిందమ్మ చెప్పుకొచ్చారు. తన భర్త అలాంటివారు కాదని  సుమారు 45 ఏళ్లుగా తనతో జీవితం పంచుకుంటున్నానని.. ఏనాడు ఆయన ద్వారా సమస్య రాలేదని చెప్పుకొచ్చారు. తన భర్త నలుగురు పిల్లలకు తండ్రి అని.. అందరికి పెళ్లిళ్లు చేశారని.. అలాంటిది ఈ వయస్సులో ఇలాంటి పనులు ఎలా చేస్తారని గోవిందమ్మ ప్రశ్నించారు.  ఆదిమూలం కుమార్తెలు కూడా ఈ విషయంపై స్పందింస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మా తండ్రి అలాంటివారు కాదు. నీతి, నిజాయితీతో పని చేసే ప్రజల మనిషి. ఆమెకు ఏవో పనులు కట్టబెట్టేలదనో.. పదవి ఇవ్వలేదనో ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలన్నీ ఫేక్ అని కొట్టి పడేసింది.

Share