నర్సీపట్నంలో పోలింగ్ బూతులు వద్ద తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పలుచోట్ల రెండు పార్టీల కార్యకర్తలు వాదులాడు కుంటున్నారు. శివపురం పోలింగ్ బూత్ వద్ద టిడిపి మాజీ కౌన్సిలర్ పైలా గోవిందు రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కొణతాల అన్నపూర్ణ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీకి చెందిన కార్యకర్తలను కొట్టారంటూ ఘర్షణకు దిగారు. పరస్పరం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సూపర్ సిక్స్ పేరుతో, సైకిల్ గుర్తు కలిగిన ఓటర్ స్లిప్ లు పంచడంపై , రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. నర్సీపట్నం డిఎస్పి మోహన్రావు జోక్యం చేసుకుని ఓటర్లకు పంచుతున్న స్లిప్ లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ స్లిప్పులు మీరు ఎలా పంచుతారని తెలుగుదేశం కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తరహా లో టిడిపి, వైసిపి కార్యకర్తలు మధ్య ఘర్షణ జరిగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు టిడిపి కార్యకర్తలు సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఉన్న స్లీప్ లు ఓటర్లకు పంచుతున్నారని గొడవకు దిగారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య వివాదం జరిగింది. వారు పంచుతున్న ఓటర్ స్లిప్పులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కొత్తవీధి పోలింగ్ కేంద్రం వద్ద టిడిపి, వైసిపి కార్యకర్తలు కొట్టుకునే స్థాయిలో గొడవకు దిగారు. ఎక్కడికక్కడ పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని గొడవలను నివారిస్తున్నారు.