Current Date: 25 Nov, 2024

హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లిపై క్లారిటీ.. వరుడు ఎవరంటే?

మహానటి 'కీర్తి సురేష్' పెళ్లి వార్తలు నెట్టింట్లో వీపరితంగా చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులు వరకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌తో డేటింగ్‌లో ఉందన్న వార్తలు వినిపించగా. తాజాగా ఆమె లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్‌తో పెళ్లి ఫిక్స్ అయ్యింది. కీర్తి తన చిన్న నాటి మిత్రుడు 'ఆంటోనీ తటిల్'ని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోనుంది. వీరిద్దరి మధ్య చాలా కాలం నుండే ప్రేమాయణం కొనసాగుతున్నట్లు తెలిసింది. డిసెంబర్ 11, 12న గోవాలో పెళ్లాడనున్నారు. కీర్తి సురేశ్ బాలీవుడ్ డెబ్యూ చేయనుంది. దళపతి విజయ్, సమంత జంటగా కలిసి నటించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'తేరి' సినిమాని బాలీవుడ్‌లో బేబీ జాన్‌గా రీమేక్ చేయనున్నారు. ఇందులో హీరోగా వరుణ్ ధావన్ నటించనుండగా, సమంత పాత్రని కీర్తి సురేష్ పోషించనుంది.

Share