Current Date: 27 Nov, 2024

లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదు..

లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. ఇప్పటికీ కొంత మంది పోలీసు అధికారుల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రక్తం ప్రవహిస్తున్నట్లుగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.. మీకు ఇంకా జగన్ మోహన్ రెడ్డిపై ప్రేమ వుంటే, ఉద్యోగానికి రాజీనామాలు చేసి ఆ పార్టీకోసం పని చేసుకోండి అంటూ సలహా ఇచ్చారు.. కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసిన వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్‌ ఇచ్చారు.. మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తాను.. అవసరం మేరకు న్యాయ పోరాటం చేస్తాం అన్నారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కావడానికి వీలు లేదన్నారు. పంచగ్రామాల భూ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని హోంశాఖ మంత్రి అనిత వెల్లడించారు.

Share