Current Date: 26 Nov, 2024

తెలంగాణ రాజకీయాల్లోకి చెప్పు సంస్కృతి ఏపీ ఫస్ట్ మొదలు

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దాంతో  పార్టీ ఫిరాయింపుల కింద కోర్టుకు కూడా ఎక్కారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. అసెంబ్లీ స్పీకర్‌కు కీలక సూచనలు చేసింది.హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపిస్తామని ఏకంగా మీడియా సమావేశంలోనే చీర, గాజులను చూపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ బండ్రు శోభారాణి ఘాటుగా స్పందించారు.భార్య, బిడ్డలను అడ్డుపెట్టుకొని హుజూరాబాద్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి చీర, గాజులు పంపాలనుకుంటే మొదట కేసీఆర్‌, కేటీఆర్‌లకే పంపాలని కౌంటర్ ఇచ్చారు. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని  లేకపోతే చెప్పుతో కొడతామంటూ ఆమె తాను వేసుకున్న చెప్పు చూపించి మరీ హెచ్చరించారు. 

Share