Current Date: 27 Sep, 2024

డైరెక్టర్‌కి ప్రభాస్ డెడ్‌లైన్.. 30 రోజులు మాత్రమే టైమ్!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. బాహుబలి కోసం ఏకంగా ఐదేళ్లు వెచ్చించిన ప్రభాస్.. ఇప్పుడు స్టైల్ మార్చాడు. ఇన్నాళ్లూ ఈ సినిమాకు ఇన్ని, ఆ సినిమాకు కొన్ని అనే విధంగా కాల్షీట్లు సర్దుబాటు చేస్తూ వచ్చాడు.  అయితే ఇప్పుడు రూట్ మార్చాడు.రాజాసాబ్ షూటింగ్ మొత్తాన్ని 30 రోజుల లోపు పూర్తి చేయాలని డైరెక్టర్‌ మారుతికి ప్రభాస్ డెడ్ లైన్ ఇచ్చాడట.  దీని కోసం నెల రోజుల కాల్షీట్లు అన్నింటినీ ఈ సినిమాకే కేటాయించాడు. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఓ కారణం ఉంది.హను రాఘవపూడి దర్శకత్వంలో సెట్స్‌పైకి వెళ్లబోతున్న సినిమాలో ప్రభాస్ నెక్ట్స్ నటించబోతున్నాడు. పీరియాడిక్ కథతో రాబోతున్న ఈ మూవీ కోసం ప్రభాస్ కాస్త డిఫరెంట్‌లుక్‌లో కనిపించాల్సి ఉంది. ఆ లుక్ రాజాసాబ్‌కి ఏమాత్రం సూట్ అవదు. అందుకే రాజాసాబ్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాకు ఇదివరకే విడుదల తేదీ ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రాజాసాబ్ థియేటర్లలోకి రానున్నాడు.

Share