Current Date: 27 Sep, 2024

చెస్‌లో అదరగొట్టేస్తున్న తెలుగు కుర్రాడు అర్జున్

తెలంగాణలోని వరంగల్‌ జిల్లాకు చెందిన ఇరిగైసి అర్జున్‌ చెస్‌లో అదరగొట్టేస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అర్జున్‌ తన కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకున్నాడు. ఓపెన్‌ విభాగం క్లాసికల్‌ ఫార్మాట్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్లేయర్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్‌ తరఫున అత్యుత్తమ ర్యాంకు ఇదే.భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ను సైతం అధిగమించిన 21 ఏళ్ల అర్జున్‌ 2778 పాయింట్లతో జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో ఉన్న నార్వేకు చెందిన మాగ్నల్‌ కార్ల్‌సన్‌ ఖాతాలో 2832 పాయింట్ల ఉన్నాయి. 2802 పాయింట్లతో అమెరికాకు చెందిన హికారు నకమురా రెండో స్థానంలో ఉన్నాడు. ఫాబియానో కరువానా 2798 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.సెప్టెంబర్‌ 10 నుంచి సెప్టెంబర్‌ 23 వరకు హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా 45వ చెస్‌ ఒలింపియాడ్‌ జరుగుతోంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల జట్టులో అర్జున్ చోటు దక్కించున్నాడు. అతడితో పాటు ఏపీ ఆటగాడు పెంటేల హరికృష్ణ, డి.గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.ప్రజ్ఞానంద, విదిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

Share