Current Date: 03 Oct, 2024

మహేష్ ఒకే ఒకసారి రూల్స్ బ్రేక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్

మహేష్ బాబు అవసరమైతే ఏన్నేళ్లయినా ఖాళీగా ఉంటాడు , నచ్చని కథ మాత్రం ఒప్పుకోడు. ఈ విషయంలో మణిరత్నం అయితే, గుణశేఖర్ అయినా అతడికి ఒకటే. కథల విషయంలో ఏమాత్రం మొహమాటపడకుండా వ్యవహరిస్తాడనే పేరున్న మహేష్ బాబు కూడా ఓ సందర్భంలో వెనక్కుతగ్గాడు. తప్పనిసరి పరిస్థితుల మధ్య ఓ సినిమా చేశాడు. అదే ఆగడు.మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌లో ఒకటి ఆగడు. నిజానికి మహేష్ చేయాల్సిన సినిమా కాదిది. ప్రాజెక్టు అనుకున్న తర్వాత, కొంత కాలం ట్రావెల్ చేసిన తర్వాత చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. అలా ఆగడు వచ్చింది, ఫ్లాప్ అయింది. దూకుడు టైమ్ లోనే మహేష్ బాబుకు ఓ అద్భుతమైన స్టోరీలైన్ చెప్పాడట దర్శకుడు శ్రీనువైట్ల. ఆ సినిమా కచ్చితంగా చేస్తానని మహేష్ మాటిచ్చాడు. అదే కథను దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత కాల్షీట్లు కూడా ఇచ్చాడు. అయితే నిర్మాతల వల్ల ఆ కథ కాకుండా, మరో కథతో ఆగడు సినిమా చేయాల్సి వచ్చిందంట.ఆగడు సినిమాతో తన గొయ్యి తానే తవ్వుకున్నట్టయిందని ఒప్పుకున్నాడు వైట్ల. ట్రెండ్ బాగా మారిపోయిందని, అప్పట్లో మహేష్ బాగా ఎక్సయిట్ అయిన ఆ కథను ఇప్పుడు సినిమాగా తీయలేమని కూడా స్పష్టం చేశాడు. 

Share