Current Date: 03 Oct, 2024

వరల్డ్ నెం.1 బౌలర్‌గా మళ్లీ నిలిచిన జస్‌ప్రీత్ బుమ్రా

టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో సత్తాచాటిన బుమ్రా.. ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరాడు.భారత్‌ - బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచుల టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా పేసు గుర్రం జస్‌ప్రీత్‌ బుమ్రా 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇప్పటివరకు టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న బుమ్రా.. ఈ దెబ్బకు టాప్‌లోకి వచ్చేశాడు. 870 రేటింగ్‌ పాయింట్లతో నెంబర్‌ వన్‌ బౌలర్‌గా నిలిచాడు.టెస్టుల్లో నెంబర్‌ వన్ బౌలర్‌గా బుమ్రా నిలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ అనంతరం కూడా అతడు అగ్రస్థానానికి చేరాడు. ఆ తర్వాత అశ్విన్ ఆ స్థానాన్ని ఆక్రమించాడు. ఇప్పుడు అశ్విన్‌ను మళ్లీ బుమ్రా బీట్ చేశాడు.

Share