Current Date: 27 Nov, 2024

ఏపీలో జనాభా సంఖ్య తగ్గిపోతోంది

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు మంత్రి పార్థసారథి వెల్లడిరచారు. దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందని, ఆంధ్రప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు తగ్గుదల అంశంపై చర్చించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏపీలో యువత జనాభా తగ్గిపోనుందని తెలిపారు. జాతీయ సగటుతో పోల్చినా ఏపీలో జనాభా సంఖ్య తక్కువగానే ఉందన్నారు. యువత తగ్గిపోతోందన్న సర్వేలు వస్తున్నాయన్నారు. ఇద్దరి పిల్లలకంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేయకూడదని స్థానిక సంస్థల్లో నిబంధన ఉందని, ఇలాంటి నిబంధనలను రద్దు చేస్తూ బిల్లుకు ఆమోదం తెలిపామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా పెరుగదల అవసరమని చెప్పుకొచ్చారు. పిల్లల సంఖ్యపై నిషేధాలు ఉండకూడదని కేబినెట్‌ భావిస్తోందని మంత్రి వెల్లడిరచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఇంతకముందు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవాళ్లు పోటీకి అనర్హత అనే నిబంధన ఉండేది. 

Share